Razole: తాటిపాక లో శరవేగంగా నూతన వంతెన నిర్మాణ పనులు
Razole: ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానిస్తూ రూ.80 లక్షలతో నిర్మిస్తున్న పెదలంక – తాటిపాక వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Razole: తాటిపాక లో శరవేగంగా నూతన వంతెన నిర్మాణ పనులు
Razole: రాజోలు మండలం తాటిపాక పంచాయతీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంక - అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామాలకు మధ్య ప్రధాన పంట కాలువపై దాదాపు రూ. 80 లక్షలతో నిర్మితమౌతున్న వంతెన పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. దీంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా కు ఆనుకుని ఉన్న పెదలంక గ్రామానికి చెందిన వందలాది మంది ప్రజల రవాణా వ్యవస్థను మెరుగు పరచడానికి మరియు ప్రజల ప్రయాణ ఇబ్బందులను తొలగించడానికి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజల అభ్యర్థన మేరకు వెంటనే స్పందించి వంతెన మంజూరు చేసిన నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు కి పెదలంక మరియు పరిసర ప్రాంతాల గ్రామాలకి చెందిన ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




