Amalapuram: ఎమ్మెల్యే తీరుపై పినిపే శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం
Amalapuram: అమలాపురం జనుపల్లిలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన డాక్టర్ పినిపే శ్రీకాంత్. నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్.
Amalapuram: ఎమ్మెల్యే తీరుపై పినిపే శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం
అమలాపురం: అమలాపురం నియోజకవర్గం,జనుపల్లి గ్రామంలో పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ స్వయంగా పరిశీలించారు.
పంట పొలాలు మునిగి తీవ్రంగా నష్టపోతున్న రైతులు తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుని కలిసి విజ్ఞప్తి చేయగా, ‘‘ఇవన్నీ కాటన్ దొర చేసిన తప్పులు’’అని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని డాక్టర్ పినిపే శ్రీకాంత్ ప్రశ్నించారు.
రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై ఉందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
పంటలు నీట మునిగి నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి,పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగ అధ్యక్షులు జిన్నూరి వెంకటేశ్వరరావు,గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీను,సూరిబాబు,రైతులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




