Amalapuram: అమలాపురంలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి భేటీ: పినిపే విశ్వరూప్

Amalapuram: అమలాపురంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి భేటీ, ఐడీ కార్డుల పంపిణీ విజయవంతంగా జరిగింది.

SURESH, AMALAPURAM
Published on: 19 Sept 2026 9:09 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి భేటీ: పినిపే విశ్వరూప్

Amalapuram: ఈ రోజు అమలాపురం వాసర్ల గార్డెన్స్ నందు మాజీ మంత్రి వర్యులు, పిఎసి సభ్యులు అమలాపురం పార్లిమెంట్ కో.. ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో,అమలాపురం అసెంబ్లీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన విస్తృతస్థాయి సమావేశం విజయవంతం నిర్వహించడం జరిగింది.

అనంతరం రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ అనుబంధ విభాగాల సభ్యులకు ఐడి కార్డ్ పంపిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలను మోసం చేసిన తీరును నిరసిస్తూ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గ పార్టీ బలోపేతం వైపు ప్రతియొక్క వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు కలిసి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చెయ్యాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయేల్,కుడిపూడి సూర్యనారాయణ రావు,రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు జిన్నూరి బాబీ,రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు,అమలాపురం పరిశీలకులు కటకంశెట్టి ఆదిత్య ,జెడ్పీటీసీలు పందిరి శ్రీహరి,గెడ్డం సంపదరావు,ఎస్. ఇ సి.మెంబెర్స్ కుడిపూడి బాబు,కుడిపూడి భరత్,పట్టణ అధ్యక్షులు సంసాని నాని,మండలాల అధ్యక్షులు ఉండ్రు బాబ్జి,కొనుకు బాపూజీ,గుత్తుల చిరంజీవి,మరియు రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ అనుబంధవిభాల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,అధికసంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు అని డా.శ్రీకాంత్ వైస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM