Pithapuram: పిఠాపురం టీడీపీలో భారీ వికెట్ కౌన్సిలర్ల రాజీనామా అస్త్రం!

Pithapuram: టీడీపీలో అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి, స్వతంత్రులుగా పోటీకి మాజీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు.

RAMA KRISHNA, KKD
Published on: 20 Oct 2026 1:16 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం టీడీపీలో భారీ వికెట్ కౌన్సిలర్ల రాజీనామా అస్త్రం!

Pithapuram: పిఠాపురం రాజకీయాల్లో టిడిపి మాజీ కౌన్సిలర్లు రాజీనామాకు సిద్ధం, స్వతంత్ర అభ్యర్థిలుగా పోటీకి సిద్ధం మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ వార్డు కౌన్సిలర్లు ప్రకటించిన కీలక నేతలు.

మొన్న ఏమో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం మాజీ ఉపాధ్యక్షుడు దేవరపల్లి రామారావు రాజీనామా... ఇప్పుడు టీడీపీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్, అల్లవరపు నగేష్ ,మాజీ కౌన్సిలర్ రాయుడు శ్రీనుబాబు, నల్ల శ్రీను కీలక నిర్ణయం

రాజీనామా బాటలో పలువురు మాజీ టీడీపీ కౌన్సిలర్లు... వార్డ్ కౌన్సిలర్లు రాజీనామాలతో ఎన్నికలపై తీవ్ర ప్రభావం ఉంటుంది... టీడీపీ నేతల రాజీనామాల వెనుక కారణాలేంటి గెలిచిన స్థానాలలో మాకు విలువ లేకుండా మాకు టికెటు ఇవ్వకుండా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు... ఇప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందన లేదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD