Chintoor: బాలుర వసతి గృహంలో వార్డెన్ వికృత చేష్టలు విద్యార్థులపై దాడి!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు బాలుర వసతి గృహంలో రూ. 250 దొంగతనం మోపి విద్యార్థులను చితకబాదిన వార్డెన్. చంపేస్తానని బెదిరింపులు, తల్లిదండ్రుల ఆగ్రహం.
Chintoor: బాలుర వసతి గృహంలో వార్డెన్ వికృత చేష్టలు విద్యార్థులపై దాడి!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం వార్డెన్ విద్యార్థులను చితకబాది చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వసతి గృహంలో ఓ విద్యార్థి కి సంబంధించి 250 రూపాయలు పోవడం జరిగింది.
ఈ దొంగతనాన్ని జీవనబాబు,శ్రీ చరణ్ లు దొంగిలించామని ఒప్పుకోవాలంటూ వార్డెన్ తాతాజీ చిన్నారులను హింసించాడు. దీంతో భయందోళనకు గురైన చిన్నారులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సోమవారం తల్లిదండ్రులు వసతి గృహానికి చేరుకొని చిన్నారులతో మాట్లాడారు.
దొంగతనం చేయకపోయినా చేశామంటూ ఒప్పుకోలంటూ తమను చితకబాదుతున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల పై వార్డెన్ చర్యలు హేయమని తల్లిదండ్రులు ఆగ్రహించారు.విద్యార్థుల పై వార్డెన్ ఈ విధంగా హింసించడం బాధాకరమని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.




