Rampachodavaram: ఈ నెల 24న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ తరలిరానున్న సీఎం
Rampachodavaram: పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈ నెల 24న జరగనున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.
Rampachodavaram: ఈ నెల 24న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ తరలిరానున్న సీఎం
రంపచోడవరం: పోలవరం జిల్లా, రంపచోడవరం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు.గురువారం రాత్రి స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలు లో ఈ నెల 24వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు సంబంధిత శాఖ అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ , జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్,ఓ ఎస్ డి జావలి,,ఆర్ డి ఓ స్వాతి,ఏఎస్స్పీ అస్రఫ్ అలీ, లు కలిసి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 24 వ తారీఖున మెగా పేరెంట్ టీచర్ మీటింగు( విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం)నకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమయానుకూలంగా పూర్తి చేసి, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.ఈ
పర్యటనకు సంబంధించిన వేదిక ఏర్పాట్లు,రవాణా,ట్రాఫిక్ నియంత్రణ,భద్రతా ఏర్పాట్లు, తాగునీరు,విద్యుత్, పారిశుద్ధ్యం,వైద్య సేవలు, అగ్నిమాపక సదుపాయాలు, పార్కింగ్, మీడియా ఏర్పాట్లు, మరుగుదొడ్లు, తాత్కాలిక షెడ్లు, త్రాగునీటి పంపిణీ తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.అదేవిదంగా ప్రతి శాఖకు కేటాయించిన డ్యూటీలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని ఆయన సూచించారు. ఏర్పాట్లలో ఎవరైనా అలసత్వం వహించిన ఎడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఏర్పాట్లలో ఏమైనా సమస్యలు ఉన్న ఎడల ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రివర్యులు వారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖలకు అధికారులకు విధులకు సంబంధించిన ప్రొసీడింగు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు.
ప్రతిష్టాత్మకమైన భద్రత ఏర్పాటు చేయాలని సంబంధిత పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఒక ప్లాన్ ప్రకారం చేయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రివర్యులు పర్యటనకు సంబంధించిన ఎలిఫడ్ ల్యాండింగ్లో ఇతరులను అనుమతించవద్దని అదేవిధంగా సభ ప్రాంగణంలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా ఎక్కడికి అక్కడ ఏర్పాట్లు చేయించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. అంబేద్కర్, ఆర్జెడి నాగమణి, డిప్యూటీ డైరెక్టర్లు రుక్మాండయ్య, షేక్ మహమ్మద్ షరీఫ్, డిఆర్డిఏ పిడి డాక్టర్ దాసరి రత్నాకర్ రావు, పిడి ఉపాధి బి.రాంప్రసాద్, డిపిఓ చంద్రశేఖర్, ఐసిడిఎస్ పిడి కె. ఉమా, డీఈవో శ్రీరామమూర్తి, డిసిహెచ్ఎస్ సాంబశివరావు, డిఎం అండ్ హెచ్ ఓ పి. సరిత, జిల్లా సివిల్ సప్లై అధికారి విజయభాస్కర్, డి డి ఎం ఓ భాస్కర్, ఎమ్మార్వో సిహెచ్ బాలాజీ, ఎంపీడీవో ప్రసాద్, ఆర్టీసీ డిఎం మార్గరెట్, ఆర్టీవో రాజేష్ కుమార్, ఈ ఈ లు ఐ. శ్రీనివాసరావు, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.




