Chintoor: చింతూరు ఎంపీపీగా చిచ్చడి మురళి ఏకగ్రీవ ఎన్నిక!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) చిచ్చడి మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం పోలవరం నిర్వాసితుల డిమాండ్లను ప్రస్తావించారు.
Chintoor: చింతూరు ఎంపీపీగా చిచ్చడి మురళి ఏకగ్రీవ ఎన్నిక!
చింతూరు: చింతూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) చిచ్చడి మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చింతూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామతులసి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఎన్నికల్లో గెలుపొందిన 12 మంది ఎంపీటీసీ లతో ప్రమాణ స్వీకారం చేయించి పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నూతన ఎంపీపీ మురళి మీడియాతో మాట్లాడుతూ... కేవలం పదవి కోసం కాదు, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్యలను ఆయన గట్టిగా ప్రస్తావించారు. నిర్వాసితులకు న్యాయం జరగాలని, వారి డిమాండ్లను ఆయన ఇలా వినిపించారు.
నిర్వాసితుల ప్రధాన డిమాండ్లు :
పోలవరం పరిహారం అనేది ఎవరూ జాలిపడి ఇచ్చేది కాదు, అది నిర్వాసితుల హక్కు. గత ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 10 లక్షల 50 వేలు ఇస్తానని అన్నది, ప్రస్తుతం కేవలం రూ.6,50,000 మాత్రమే ఇస్తున్నారు.
తమ జీవితాలను త్యాగం చేసి, తాతల ముత్తాతల నుండి నివసించిన జన్మస్థలం వదిలి వెళ్లిన వారికి ఇచ్చే పరిహారం న్యాయమా? దానితో జీవితాలు బాగుపడతాయా? ఆలోచించాలని డిమాండ్. ఇండ్లకు సంబంధించి స్ట్రక్చర్ వాల్యుయేషన్ కూడా మూడు రెట్లు ఇవ్వాల్సి ఉంది, నాటిని కూడా అరకొరగా, అనకనకలుగా చాలా తక్కువగా ఇచ్చారని ఆవేదన.
నిర్వాసితుల కుటుంబాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులను 2022 సంవత్సరం కటాఫ్ కాకుండా నిర్వాసితులుగా ఖాళీ చేసే సమయానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం ఇవ్వాలి.
పోలవరం ప్రాజెక్టు నష్టపరిహారం గురించి ఎదురు చూసి చూసి చనిపోయిన పీడీఎఫ్ లకు నష్టపరిహారం నిలిపివేస్తున్నారు. అలా కాకుండా చనిపోయిన వారి నష్టపరిహారం ఆ కుటుంబాలకు చెల్లించాలి. నిర్వాసితులకు పునరావాసం, నిర్వాసితులకు ఇవ్వడం ఉన్నచోట ఇవ్వాలి, తప్ప ప్రభుత్వ అధికారులు తమకు ఇష్టం వచ్చిన దగ్గర ఇవ్వడం కాదు.
గత ప్రభుత్వంలో 45 కాంటూర్లో ఉన్న 72 గ్రామాలను 41.15 లో కలపాలని తీర్మానం చేశాము. 32 గ్రామాలను 41.15 కాంటూర్ లోకి చేర్చారు. ఇంకా మిగిలి ఉన్న గ్రామాలను కూడా 41.15 కాంటూర్ లోకి తీసుకురావాలని రావాలని తీర్మానం చేస్తున్నాము.
నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలి. నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా మొదటి మండల పరిషత్ సమావేశంలో తీర్మానం చేస్తామని మురళి హామీ ఇచ్చారు. దీంతో నిర్వాసితుల్లో నూతన ఆశలు చిగురించాయి.




