Chintoor: పేర్లు ఒకటే.. పోస్టులు మారాయి! చింతూరులో ఆసక్తికర పరిణామం!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘనవిజయం సాధించింది. గతంలో పనిచేసిన సవలం అమల, చిచ్చడి మురళి ఈసారి పదవులు మార్చుకోవడం విశేషం.

RAJESH REDDY, CHINTOOR
Published on: 12 Nov 2026 6:38 PM IST
Chintoor
X

Chintoor: పేర్లు ఒకటే.. పోస్టులు మారాయి! చింతూరులో ఆసక్తికర పరిణామం!

చింతూరు: చింతూరు మండలంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. మండలంలోని జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. జడ్పీటీసీగా సవలం అమల విజయం సాధించగా, చింతూరు ఎంపీపీగా చిచ్చడి మురళి ఎన్నిక కానున్నారు.అయితే ఇక్కడే ఆసక్తికర విషయం ఉంది.

గత ఎన్నికల్లో జడ్పీటీసీగా మురళి, ఎంపీపీగా అమల పనిచేశారు. ఈసారి ఇద్దరూ పదవులు మార్చుకున్నట్లు అయింది. అంటే గతంలో జడ్పీటీసీగా ఉన్న మురళి ఇప్పుడు ఎంపీపీ కాబోతుండగా, గతంలో ఎంపీపీగా ఉన్న అమల ఇప్పుడు జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. దీంతో పేర్లు ఒకటే, పోస్టులు మారాయని మండలంలో ప్రజలు సరదాగా చెప్పుకుంటున్నారు.ఇద్దరి అనుభవం మండల అభివృద్ధికి ఉపయోగపడుతుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR