Rampachodavaram: 70 ఏళ్ల వయసులోనూ తగ్గని సీతంశెట్టి వెంకటేశ్వరరావు ఉత్సాహం!

Rampachodavaram: పోలవరం జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు 70 ఏళ్ల వయసులోనూ 8 మండలాల్లో ప్రచారం చేసి, 7 జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు.

Prasanna, Rampachodavaram
Updated on: 13 Nov 2026 7:39 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: 70 ఏళ్ల వయసులోనూ తగ్గని సీతంశెట్టి వెంకటేశ్వరరావు ఉత్సాహం!

రంపచోడవరం: రంపచోడవరం వయసు 70 ఏళ్లు దాటినా రాజకీయ ఉత్సాహంలో ఏమాత్రం తగ్గకుండా, తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై, తెలుగుదేశం పార్టీపై తనకున్న నిబద్ధతను మరోసారి చాటుకున్నారు మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు. 2026 ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పోలవరం జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఆయన స్వయంగా ప్రచారంలో పాల్గొనగా, ఏడు జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం విశేషంగా నిలిచింది. అలాగే పలు ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన రాజకీయ అనుభవాన్ని ఈ ఎన్నికల్లో ఆయన సమర్థవంతంగా వినియోగించుకున్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ, వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు.

తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కనపెట్టి, కూటమి అభ్యర్థుల విజయమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగడం ఆయన రాజకీయ అనుభవాన్ని, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. ముఖ్యంగా వయసును సైతం లెక్కచేయకుండా మండలాలవారీగా పర్యటిస్తూ, అభ్యర్థులకు అండగా నిలవడం స్థానిక రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిచింది.

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ఏడు జెడ్పీటీసీ విజయాలు... ఎనిమిది మండలాల్లో ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల ప్రచారంలో శ్రీ సీతంశెట్టి వెంకటేశ్వరరావు పోషించిన పాత్ర ఇప్పుడు పోలవరం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram