Chintoor: పోలవరం జిల్లాలో నవంబర్ 29న రెండో దశ పంచాయతీ ఎన్నికలు!

Chintoor: పోలవరం జిల్లాలోని 7 మండలాల పరిధిలో 95 గ్రామ పంచాయతీలకు నవంబర్ 29న రెండో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 13 Nov 2026 4:17 PM IST
Chintoor
X

Chintoor: పోలవరం జిల్లాలో నవంబర్ 29న రెండో దశ పంచాయతీ ఎన్నికలు!

చింతూరు: పోలవరం జిల్లాలో రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 29న జరగనున్నాయి. 7 మండలాల పరిధిలో మొత్తం 95 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.

గుర్తేడు మండలంలో 5, వై.రామవరంలో 12, చింతూరులో 18, మారేడుమిల్లిలో 12, కూనవరంలో 16, వి.ఆర్.పురంలో 11, ఏటపాకలో 21 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి అదే పోలింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR