Chintoor: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన పరిశీలకులు బి.ఆర్. అంబేద్కర్
Chintoor: పోలవరం జిల్లా పరిషత్ ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలని ఎన్నికల అబ్జర్వర్ బి.ఆర్. అంబేద్కర్ ఆదేశం. చింతూరు కౌంటింగ్ కేంద్రంలో కలెక్టర్, ఎస్పీతో తనిఖీలు.
Chintoor: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన పరిశీలకులు బి.ఆర్. అంబేద్కర్
చింతూరు: పోలవరం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరగాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు బి.ఆర్. అంబేద్కర్ సూచించారు. శనివారం జరగనున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో చింతూరు కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను ఆయన జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ కె. దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, సబ్ కలెక్టర్ నరేంద్ర పడాల్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లు, భద్రతా ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు హాళ్లు, కౌంటింగ్ సిబ్బందికి కల్పించిన సౌకర్యాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, నిరంతర నిఘా తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని అబ్జర్వర్ సూచించారు. కౌంటింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతించాలని, క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె. దినేష్ కుమార్, ఎస్పీ కె. చక్రవర్తి సూచించారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.




