Kadiyam: కడియంలో పోలీసుల ఫుట్ మార్చ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకేనన్న డీఎస్పీ!
Kadiyam: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా జరిపేందుకు రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి ఏ. శివప్రియ ఆధ్వర్యంలో కడియంలో పోలీసుల ఫుట్ మార్చ్ నిర్వహించారు.
Kadiyam: కడియంలో పోలీసుల ఫుట్ మార్చ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకేనన్న డీఎస్పీ!
Kadiyam: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిపించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి ఏ శివప్రియ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక శివాలయం నుండి కడియం గ్రామ వీధులలో తిరుగుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ఫుట్ మార్చ్ నిర్వహించారు.
ఈసందర్భంగా డిఎస్పి శివప్రియ మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెట్రోలింగ్ బైండోవర్ లను ఫాలో చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ధైర్యంగా తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకుని పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు మండలంలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న పోలింగ్ బూత్‌లను సీఐ ఏ. వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, భద్రతాపరమైన అంశాలను, లోటుపాట్లను పరిశీలించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధవలేశ్వరం సిఐ టి గణేష్ కడియం ఎస్సై దుర్గాప్రసాద్, కడియం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




