Sakinetipalli: సఖినేటిపల్లి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు!
Sakinetipalli: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసి 7 గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Sakinetipalli: సఖినేటిపల్లి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు!
Sakinetipalli: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5,830 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సఖినేటిపల్లి ఎస్సై హరికోటి శాస్త్రి తెలిపారు.
అంతర్వేదిపాలెంలో పేకాట నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని ఎస్సై తెలిపారు.




