Amalapuram: పోలీసుల మెరుపు దాడి..సైలెన్సర్లు లేని 16 బైక్‌లు స్వాధీనం!
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో భయాందోళనలు సృష్టించిన 16 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Amalapuram: పోలీసుల మెరుపు దాడి..సైలెన్సర్లు లేని 16 బైక్‌లు స్వాధీనం!
అమలాపురం: అమలాపురం పట్టణంలో ఒక ప్రముఖ సినిమా హీరో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కొంతమంది యువకులు తమ మోటార్ సైకిల్ సైలెన్సర్లను తీసివేసి అధిక శబ్దాలతో అమలాపురం పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.
రోడ్లపై విచ్చలవిడిగా సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించడంతోటీ ఎస్ పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ ఆదేశాలు తో పట్టణ సీఐ వీరబాబు,ట్రాఫిక్ ఎస్ ఐ యేసుబాబు టీమ్ రంగంలోకి దిగింది.అధిక శబ్దాలు చేస్తూ తిరుగుతున్న యువకుల వెంటపడి 16 మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు.పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాజోలు పోలీస్ మాదిరిగా చర్యలు తీసుకుని తగిన విధంగా శిక్షింఛాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా పలువురు సీ.ఐ వీరబాబు కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.ఈ విధంగా ఎవరైనా యువకులు తమ మోటార్ సైకిల్ లకు సైలెన్సర్లు తీసివేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీ.ఐ వీరబాబు హెచ్చరించారు.




