Kadiyam: కడియం చైతన్య నగర్లో పోలీసుల తనిఖీలు 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం!
Kadiyam: తూర్పుగోదావరి జిల్లా కడియం చైతన్య నగర్లో పోలీసుల కార్డెన్ సెర్చ్. ఎన్నికల నేపథ్యంలో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
Kadiyam: కడియం చైతన్య నగర్లో పోలీసుల తనిఖీలు 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం!
కడియం: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ప్రజలందరూ ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగే ఉద్దేశంతో తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు ప్రకారం దక్షిణ మండలం డీఎస్పీ A. శివ ప్రియ ఆధ్వర్యంలో కడియం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ A .వెంకటేశ్వరరావు , ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ T. గణేష్ , కడియం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ B. దుర్గాప్రసాద్, PDL ప్రసన్న గారు , టూ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ మరియు దక్షిణ మండల సిబ్బందితో కలిసి కడియం మండలంలో చైతన్య నగర్ లో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్, పేస్ ట్రాకర్, ఫింగర్ ప్రింట్ డివైసెస్ ద్వారా నిర్వహించిన కార్డెన్ సెర్చ్ లో భాగంగా చైతన్య నగర్ లో ఉన్న సస్పెక్ట్స్ మరియు ఇతర ట్రబుల్ మాంగర్స్ చెక్ చేసి ఎటువంటి రికార్డ్ లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం పరుచుకున్నాము.




