Konaseema: రామచంద్రపురంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

Konaseema: రామచంద్రపురం, కె.గంగవరం, కాజులూరు మండలాల్లో ఆదివారం జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 28 Nov 2026 5:33 PM IST
Konaseema
X

Konaseema: రామచంద్రపురంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

Konaseema: ఈ విడతలో రామచంద్రపురం, కె.గంగవరం, కాజులూరు మండలాల్లో పోలింగ్ జరగనుంది.పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమై, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.ఈ నేపథ్యంలో రామచంద్రపురం నుండి ఎన్నికల విధులకు కేటాయించిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, ఓటరు జాబితాలు, ఇతర ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందజేశారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయనున్నారు.పోలింగ్ సిబ్బంది శనివారం సాయంత్రానికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకొని, ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI