Gokavaram: గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై ప్రత్యేక అవగాహన!
Gokavaram: గోకవరం మండలం పెంటపల్లిలో పోషణ మాస కార్యక్రమం. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం, మొదటి 1000 రోజుల సంరక్షణపై ఐసీడీఎస్ అధికారుల అవగాహన.
Gokavaram: గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై ప్రత్యేక అవగాహన!
గోకవరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "పోషణ మాహా" కార్యక్రమం కోరుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో ఘనంగా జరిగింది. గ్రామ సచివాలయం, అంగన్వాడీ కేంద్రం, డ్వాక్రా మహిళా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తంటికొండ సెక్టార్ సూపర్వైజర్ పెనుగొండ ఇందిరా రాణి ముఖ్య అతిథిగా జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు ఎన్ నాగమణి, జె సుబ్బలక్ష్మి, టి బుజ్జమ్మ, కే కృష్ణవేణి, బి మైధిలి, జి అమ్మాణి ల ఆధ్వర్యంలో జరిగిన. ఈ కార్యక్రమానికి సీనియర్ అంగన్వాడి కార్యకర్త ఎమ్ వి వి ఎస్ భాస్కరం, జి రత్నం ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇందిరా రాణి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు బాలింతలు, గర్భిణీలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం - ఆకుకూరలు, పప్పులు,గుడ్లు,పాలు,పండ్లు,మిల్లెట్స్ చిరుధాన్యాలు ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించి.
గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలింతలు పాటించాల్సిన పరిశుభ్రత, చంటి పిల్లలకు మొదటి 1000 రోజులు బంగారు రోజులు అని ఇందిరా రాణి అన్నారు, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న బాలామృతం,టేక్ హోమ్ రేషన్,గోరు ముద్ద పలు పథకాల గురించి సూపర్వైజర్ వివరించి చెప్పారు.
తంటికొండ సెక్టార్ సూపర్వైజర్ ఇందిరా రాణి ఏ ఎన్ ఎం నాగలక్ష్మి, అంగన్వాడి కార్యకర్తలు ఎన్ నాగమణి జె సుబ్బలక్ష్మి టి బుజ్జమ్మ కే కృష్ణవేణి బి మైధిలి జి అమ్మాణి లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ అంగన్వాడి కార్యకర్త ఎమ్ వి వి ఎస్ భాస్కరం, జి రత్నం తదితర సుమారు 30 మంది వరకు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశానికి డ్వాక్రా మహిళలు తల్లులు కమిటీ సభ్యులు ఆశా వర్కర్లు, డ్వాక్రా వివోలు తదితరులు పాల్గొన్నారు.




