Razole: రాజోలులో పల్స్ పోలియో.. చిన్నారులకు చుక్కలు వేసిన పెదకాపు

Razole: రాజోలు నియోజకవర్గంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం. మలికిపురంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మార్క్‌ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల నరశింహరావు.

PRABHU, RAZOLE
Published on: 28 Jun 2026 2:28 PM IST
Razole
X

Razole: రాజోలులో పల్స్ పోలియో.. చిన్నారులకు చుక్కలు వేసిన పెదకాపు

రాజోలు: రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేస్తూ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గ్రామ పంచాయతీలతో పాటు బస్టాండ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు.

మలికిపురం పంచాయతీ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన సీనియర్ నేత, ఏపీ రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల నరశింహరావు (పెదకాపు) పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మలికిపురం ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story