Rajahmundry: పటిష్ట ప్రణాళికతో గోదావరి పుష్కర పనులు - స్పెషల్ ఆఫీసర్ భరత్ గుప్తా!
Rajahmundry: రాజమండ్రిలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై స్పెషల్ ఆఫీసర్ నారాయణ భరత్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా క్షేత్రస్థాయి పరిశీలన.
Rajahmundry: పటిష్ట ప్రణాళికతో గోదావరి పుష్కర పనులు - స్పెషల్ ఆఫీసర్ భరత్ గుప్తా!
Rajahmundry: రానున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.
బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర భౌగోళిక స్వరూపం, పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ, ఘాట్ల వద్ద ఏర్పాట్లు, ట్రాఫిక్ పరిస్థితులు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా భరత్ గుప్తా మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నదీ తీరంలో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత పుష్కరాల్లో గోదావరి నదిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, వారికి కల్పించిన వసతులు, తాగునీరు, తాత్కాలిక వసతులు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తో కలిసి పర్యటించినట్లు తెలిపారు.




