Rajahmundry: సాహస కథాంశంతో వస్తున్న'రాజా ది రాజా'జూలై 17 గ్రాండ్ రిలీజ్!
Rajahmundry: యువ హీరో రుత్విక్, హీరోయిన్ విశాఖ నటించిన పీరియాడిక్ అడ్వెంచరస్ ఫిల్మ్ 'రాజా ది రాజా'. జూలై 17న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్
Rajahmundry: సాహస కథాంశంతో వస్తున్న'రాజా ది రాజా'జూలై 17 గ్రాండ్ రిలీజ్!
రాజమండ్రి:రాజుల కాలం నాటి ఒక యువకుడు సాహస కథాంశం తో వస్తున్న రాజా ది రాజా చిత్రాన్ని ఈనెల 17 వ తేదీన విడుదల చేస్తున్నామని థియేటర్లకి వెళ్లి ఆదరించాలని చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది.
చిత్రం ప్రమోషన్ లో భాగంగా హీరో, హీరోయిన్ల లతో పాటు చిత్ర బృందం స్థానిక షెల్టన్ హోటల్ లో మీడియాతో మాట్లాడారు. చిత్రం యువ హీరో రుత్విక్ మాట్లాడుతూ, ఆత్మాభిమానం గల ఒక యువకుడి సాహసం తో కూడిన ఈ చిత్రంలో మంచి నటీనటులు నటించారని డైరెక్టర్ చక్కగా తెరకెక్కించారని అన్నారు.
ఈనెల 17వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుందని, చిత్రాన్ని ఆదరించాలని కోరారు. హీరోయిన్ విశాఖ మాట్లాడుతూ, ఇది తనకు తొలి సినిమా అని, సాహస యువకుడ్ని ప్రేమించి, ప్రోత్సహించే విధంగా తన పాత్ర ఉంటుందన్నారు. నిర్మాత కె నిహారిక దాసరి మాట్లాడుతూ కథపరంగా నాణ్యతకు ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించామని తెలిపారు.
హాస్య నటుడు భద్ర మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రమోషన్ని హైదరాబాద్ వంటి నగరాల్లో కాకుండా సెంటిమెంట్ గా భావించి నుంచి ప్రమోషన్ చేపట్టామన్నారు. చిత్రంలో హీరో హీరోయిన్లు కొత్త తరం వారని, అయినప్పటికీ సీనియర్ నటీనటులతో చక్కగా నటించారని అన్నారు. సినిమా రంగంతో పూర్వ అనుబంధం లేని మహిళ నిహారిక నిర్మాతగా రాణించడం, కొత్త తరాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
మరో నటుడు పార్వతీశం మాట్లాడుతూ ఎన్నో ఓడిదుడుకులు ఉన్నటువంటి సినీ పరిశ్రమలో నిర్మాతగా మహిళ ప్రవేశించడమే రాకుండా చిత్ర నిర్మాణాన్ని నాణ్యత లో రాజీ పడకుండా చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యాంకర్ శ్రీవాణి ఉన్నారు.




