Rajahmundry: రాజమండ్రిలో ఆలయన్స్ సిటీ క్లబ్ ఆధ్వర్యంలో ట్రీ ప్లాంటేషన్
Rajahmundry: రాజమండ్రి వీరభద్రపురంలోని టౌన్ మునిసిపల్ హైస్కూల్‌లో అలైన్స్ సిటీ క్లబ్ ఆధ్వర్యంలో వంద మొక్కలు నాటి, విద్యార్థులకు పర్యావరణ అవగాహన కల్పించారు.
Rajahmundry: రాజమండ్రిలో ఆలయన్స్ సిటీ క్లబ్ ఆధ్వర్యంలో ట్రీ ప్లాంటేషన్
Rajahmundry: ఆలయన్స్ సిటీ క్లబ్ ఆధ్వర్యంలో వీరభద్రపురంలోని ఇన్కమ్ టాక్స్ ఆఫీసు వెనుక గల టౌన్ మునిసిపల్ హై స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ఆలయన్స్ సిటీ క్లబ్ అధ్యక్షులు రవి కుమార్ ఆధ్వర్యంలో వివిధ రకాలకు చెందిన 100 మొక్కలను హై స్కూల్ నందు నాటడం జరిగింది.
స్కూల్ ప్రిన్సిపల్ సూరి బాబు కోరిక మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలయన్స్ క్లబ్ గవర్నర్ కె. వి. సత్యనారాయణ పిలుపు మేరకు ట్రీ ప్లాంటేషన్ ను అన్ని క్లబ్ లు నిర్వహించడం జరుగుతుంది.దీనిలో భాగంగా టౌన్ హై స్కూల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం అక్కడి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై క్లబ్ సభ్యులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో క్లబ్ సభ్యులు ఘంటసాల, శేషు బాబు, గంటి బాబ్జి, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.




