Rajahmundry: రాజమండ్రిలో పింఛన్ల పంపిణీని పరిశీలించిన కలెక్టర్!

Rajahmundry: రాజమండ్రిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. పారదర్శకంగా పింఛన్లు అందించాలని అధికారులను ఆదేశించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 1 Aug 2026 2:12 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో పింఛన్ల పంపిణీని పరిశీలించిన కలెక్టర్!

లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ల పంపిణీ : కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమండ్రి:

అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సామాజిక భద్రత పింఛన్లు సక్రమంగా అందేలా పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు.

శనివారం ఉదయం రాజమహేంద్రవరం నగరంలోని గోపాలనగర్ పుంత ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. ఎక్కడా జాప్యం లేదా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు తగిన సూచనలు చేశారు.

సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆధార్ కార్డు పరిశీలన అనంతరం ఫేస్ రికగ్నిషన్ సిస్టం (FRS) ద్వారా ధృవీకరించి పింఛన్ నగదును అందజేశారు.

ఈ సందర్భంగా వృద్ధులు, ఇతర పింఛన్ లబ్ధిదారులతో కలెక్టర్ ఆప్యాయంగా ముచ్చటించి వారి ఆరోగ్యం, సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా పింఛన్ సక్రమంగా అందుతోందా, ఎంత మొత్తం వస్తోంది, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు.

పింఛన్లు తమ జీవనానికి ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని పలువురు లబ్ధిదారులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి వారు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

అనంతరం కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పారదర్శకంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం మంచి లక్ష్యంతో అందిస్తున్న ఈ పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

జిల్లాలో మొత్తం 2,67,217 మంది లబ్ధిదారులు ఉండగా, మధ్యాహ్నం వరకు 2,32,118 మందికి రూ.101.71 కోట్లు ఇంటి వద్దనే పంపిణీ చేసినట్లు తెలిపారు. మొత్తం పంపిణీ చేయాల్సిన మొత్తం రూ.118.80 కోట్లు అని వెల్లడించారు.

సాయంత్రానికల్లా శతశాతం పింఛన్ల పంపిణీ పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఎంసి సెక్రటరీ శైలజవల్లి, మున్సిపల్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story