Rajahmundry: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే భవనాలు వినియోగించాలి కమిషనర్

Rajahmundry: రాజమండ్రి జేఎన్ రోడ్డులో కమిషనర్ రాహుల్ మీనా క్షేత్రస్థాయి తనిఖీలు. ప్లాన్ల ప్రకారమే కడితేనే నివాసయోగ్య ధృవీకరణ పత్రం జారీ అని స్పష్టీకరణ.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 1 July 2026 6:10 PM IST
Rajahmundry
X

Rajahmundry: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే భవనాలు వినియోగించాలి కమిషనర్

రాజమండ్రి: అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. బుధవారం ఉదయం చందా సత్రం వీధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా ఆయన పర్యవేక్షించారు. ప్రతి ఒక్క లబ్ధిదారుని ఇంటికి వెళ్లి వారి ఆధార్ కార్డులను పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు.

ఈ సందర్భంగా పింఛన్ దారులతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ.. పింఛన్ సాయం ఏవిధంగా ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. నగరంలో పింఛన్ల పంపిణీ సజావుగా కొనసాగుతోందని.. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే వెంటనే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. అర్బన్ లో అర్హులైన ప్రతిఒక్కరికీ సామాజిక పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవలసిందిగా సూచించారు. జూలై నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించే క్రమంలో నగరంలో 27,395 పింఛనుదారులకు ప్రభుత్వం 12 కోట్ల 18 లక్షల 47 వేల రూపాయలు విడుదల చేసిందన్నారు.

మొదటి రోజే నూరు శాతం పింఛన్లు పంపిణీ చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సాయంత్రానికల్లా పంపిణీ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా, శత శాతం పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఎంసి సెక్రటరీ శైలజవల్లి, ఎంహెచ్ఓ వినూత్న, ఇతర మున్సిపల్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story