Rajahmundry: రాజమండ్రిలో అభివృద్ధి పనులు.. క్షేత్రస్థాయిలో కమిషనర్ పరిశీలన!
Rajahmundry: రాజమండ్రి నగరంలో పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను కమిషనర్ రాహుల్ మీనా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యతతో త్వరగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
Rajahmundry: రాజమండ్రిలో అభివృద్ధి పనులు.. క్షేత్రస్థాయిలో కమిషనర్ పరిశీలన!
రాజమండ్రి: నగర ప్రజలకు ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేసి ప్రతిపాదనలను బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు.
12 వ వార్డు ఎస్.బి.ఐ కాలనీ పార్కులో రూ.5 లక్షలతో మరమ్మతులు., అదే ప్రాంతంలో రూ. 9 లక్షలతో నూతన డ్రెయిన్ నిర్మాణం., మోడల్ కాలనీలో రూ. 28 లక్షలతో రెండు నూతన రహదారులు, 9 వ వార్డులో రూ. 9 లక్షలతో డ్రెయిన్ నిర్మాణానికి అంచనాలు రూపొందించగా.. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కమిషనర్ అన్నారు.
అంచనాలకు అనుగుణంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పనులు జరగాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎస్ఈ రీటా, డీఈ లోవరాజు, ఏఈ దుర్గాప్రసాద్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.




