Rajahmundry: రాజమండ్రిలో కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన కమిషనర్ రాహుల్
Rajahmundry: రాజమండ్రి ఎస్కేవీటీ కళాశాలలో నగరపాలక ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా.
Rajahmundry: రాజమండ్రిలో కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన కమిషనర్ రాహుల్
రాజమండ్రి: నగరపాలక ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోందని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. SKVT కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లు, ఎన్నికల సామాగ్రి భద్రపరిచే విధానం, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని, భద్రతా పరమైన అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎంహెచ్ఓ వినూత్న, ఈఈలు మదర్షా అలీ, మాధవి, మేనేజర్ అబ్దుల్ మలిక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.




