Rajahmundry: రాజమండ్రి కార్పొరేషన్‌లో ఘనంగా జరిగిన అఖిలపక్ష సమావేశం!

Rajahmundry: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితాపై కమిషనర్ రాహుల్ మీనా రాజకీయ పార్టీలతో సమీక్ష నిర్వహించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 28 Oct 2026 7:37 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రి కార్పొరేషన్‌లో ఘనంగా జరిగిన అఖిలపక్ష సమావేశం!

Rajahmundry: డ్రాఫ్ట్‌ పోలింగ్‌ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని కమిషనర్ రాహుల్ మీనా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లకు అనుకూలమైన పోలింగ్ కేంద్రాలపై కూలంకషంగా చర్చించారు.

పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలో ఏవైనా మార్పులు, చేర్పులు లేదా లోటుపాట్లు ఉంటే సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులు లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. సమావేశంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY