Rajahmundry: శాఖల సమన్వయంతోనే పుష్కరాల దిగ్విజయం - కమిషనర్
Rajahmundry: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాజమండ్రి నగరపాలక సంస్థలో కమిషనర్ రాహుల్ మీనా శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు.
Rajahmundry: శాఖల సమన్వయంతోనే పుష్కరాల దిగ్విజయం - కమిషనర్
రాజమండ్రి: పుష్కరాల ఏర్పాట్లు ఒక్క శాఖకు పరిమితం కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఆర్ఎంసి, జలవనరులు, ఆర్ అండ్ బీ, విద్యుత్, పర్యాటక, దేవాదాయ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి శాఖ చేపట్టాల్సిన పనులకు స్పష్టమైన గడువులు నిర్ణయించి, పనులు ప్రజలకు తెలిసేలా పారదర్శకతతో చేపట్టాలన్నారు. అలాగే పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ఒకరికొకరు సమాచారాన్ని పంచుకుంటూ.. కలుపుకొని పోయినప్పుడే పుష్కరాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగుస్తాయన్నారు.
లక్షలాది మంది భక్తులు ఒకేసారి తరలివచ్చే ఇలాంటి మహా క్రతువులలో ఏ ఒక్క శాఖ విఫలమైనా మొత్తం వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుందన్నారు. కనుక ప్రతి ఒక్క అధికారి మిగతా శాఖలలో జరుగుతున్న పనులపైన కూడా కనీస అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పుష్కరాల కోసం రూపొందించే కార్యాచరణ ప్రణాళిక భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న నిర్మాణాలకు ఎక్కడా, ఎటువంటి నష్టం వాటిల్లకుండా.. చేపట్టిన పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.




