Rajahmundry: రాజమండ్రిలో క్రెడాయ్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం

Rajahmundry: రాజమండ్రిలో ఏపీ క్రెడాయ్ వార్షిక సర్వసభ్య సమావేశం. అసంఘటిత బిల్డర్లను క్రెడాయ్ పరిధిలోకి తెచ్చి, నిబంధనలు పాటించేలా చేద్దామని రాష్ట్ర చైర్మన్ పిలుపు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 28 Sept 2026 5:40 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో క్రెడాయ్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం

రాజమండ్రి: అసంఘటితంగా ఉన్న బిడ్లర్స్ ని కూడా క్రెడాయ్ పరిధిలో మెంబర్స్ చేర్చుకోవడం ద్వారా క్రెడాయ్ ని బలోపేతం చేసుకోవడంతో పాటు అందరూ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చేద్దామని రాష్ట్ర చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ సూచించారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర క్రెడాయ్ వార్షిక సర్వ సభ్య సమావేశం స్థానిక హోటల్ షెల్టాన్ లో ఆదివారం జరిగింది.

క్రెడాయ్ రాజమహేంద్రవరం చాప్టర్ హోస్ట్ చేసిన ఈ సమావేశంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం బుడ్డిగ శ్రీనివాస్ మాట్లాడుతూ 'రెరా' రాకముందే క్రెడాయ్ స్వచ్ఛందంగా కొన్ని నిబంధనలు ఏర్పాటుచేసుకుని వాటిని అమలు చేసుకుంటున్నామని ఆయన గుర్తుచేసారు.

ఖాతాదారులకు ఇచ్చిన మాట ప్రకారం నిర్మాణం పూర్తిచేసి ఇస్తున్న ఘనత క్రెడాయ్ కి దక్కుతుందన్నారు. ఒకవేళ ఎక్కడైనా తేడా జరిగితే కూర్చోబెట్టి సెటిల్ చేస్తున్నామన్నారు. అదే సమయంలో క్రెడాయ్ లో లేని బిల్డర్స్ గురించి ఎక్కడైనా తేడా జరిగితే క్రెడాయ్ కి వచ్చి పిర్యాదు చేస్తున్నారని బుడ్డిగ శ్రీనివాస్ గుర్తుచేస్తూ, అలా పిర్యాదు చేసినవారికి అవగాహన కల్పించి 'రెరా' కు పిర్యాదు చేయమని చెబుతున్నామని బుడ్డిగ శ్రీనివాస్ పేర్కొంటూ, రాష్ట్రంలో క్రెడాయ్ అన్ని చాప్టర్స్ లో ఇదే పాటించాలని సూచించారు.

ఇప్పటికే పలు సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సానుకూల స్పందన తీసుకు రాగలిగామని, మిగిలిన సమస్యలపై కూడా ప్రభుత్వ పెద్దలను కల్సి విన్నవిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం కూడా మనకు అవసరమైన జీవోలు ఇస్తూ, సహకరిస్తోందని బుడ్డిగ శ్రీనివాస్ గుర్తుచేసారు.

క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు బయ్యాన శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు,కోశాధికారి కె గోపీనాధ్, రాజమహేంద్రవరం చాప్టర్ చైర్మన్ సూరవరపు శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ మన్యం సంతోష్ ఫణికుమార్, జనరల్ సెక్రటరీ చల్లా బాల మురళికృష్ణ, ఎన్విరాన్ మెంట్ కమిటీ మెంబర్ కర్రి సోమ శేఖర్ రెడ్డి వేదికపై ఉన్నారు. ఈసమావేశంలో 22 చాప్టర్స్ ఛైర్మన్స్, ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, జోనల్ ఇన్ చార్జీలు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చల్లా బాలమురళి కృష్ణ వందన సమర్పణ చేసారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY