Rajahmundry: దేవీచౌక్‌లో పందిరి రాట ముహూర్తం: మార్గాని భరత్ రామ్ పూజలు
Rajahmundry: రాజమండ్రి దేవీచౌక్ శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి 93వ శరన్నవరాత్రి మహోత్సవాల పందిరి రాట మహోత్సవంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పాల్గొన్నారు.
Rajahmundry: దేవీచౌక్‌లో పందిరి రాట ముహూర్తం: మార్గాని భరత్ రామ్ పూజలు
రాజమండ్రి: చారిత్రక ప్రసిద్ధి చెందిన దేవీచౌక్ లో శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (కనకదుర్గమ్మ) 93వ శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేయడానికి గురువారం ఉదయం 9.44 గంటలకు పందిరి రాట ముహూర్తం చేసారు.
ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసిపి జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు, డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు హాజరై కొబ్బరికాయలు కొట్టారు.
ఈ సందర్భంగా మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ దేవీచౌక్ బాలత్రిపుర సుందరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 93వ సంవత్సరానికి చేరుకోవడం గర్వకారణమన్నారు. నగర ప్రజలందర్నీ ఆశీర్వదించే ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు.
అందరూ ఈ ఉత్సవాýకు సహకరించాలని కోరారు. వారి వెంట వైసిపి నాయకులు మార్గాని సురేష్, దాసి వెంకట్రావు, పీతా రామకృష్ణ తదితరులు ఉన్నారు.




