Rajahmundry: కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రహ్మణ్యంకు నివాళి

Rajahmundry: రాజమండ్రిలో కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రహ్మణ్యంకు ఘన నివాళి. పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 28 Sept 2026 5:38 PM IST
Rajahmundry
X

Rajahmundry: కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రహ్మణ్యంకు నివాళి

రాజమండ్రి: కాపు సంఘాల అభివృద్ధికి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు అహర్నిశలు శ్రమించిన గాళ్ల సుబ్రహ్మణ్యం సేవలు మరువలేని పలువురు కాపు ప్రముఖులు కొనియాడారు.ఇటీవల విజయవాడలో గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందిన కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం కు రాజమండ్రి దేవీచౌక్ లో కాపునాడు కార్యాలయం వద్ద సోమవారం ఉభయగోదావరి జిల్లాలు అధ్యక్షుడు గుదేరఘు నరేష్, కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, సీసీ ఛానల్ ఎండి పంతం కొండలరావు, టిడిపి రాష్ట్ర నాయకులు యర్రా వేణుగోపాల రాయుడు, వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, టిడిపి అధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర ప్రముఖులు, రాష్ట్ర కాపు నాయకులు, ఆకుల వెంకటేశ్వరరావు, ఆర్లపల్లి పురుషోత్తం, కోటిపల్లి కేశవరావు, దేశిరెడ్డి బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైగా స్వర్గీయ గాళ్ళ సుబ్రహ్మణ్యం వంగవీటి మోహన రంగాతో మొదలుకొని అనేక ఉద్యమాల్లో పాల్గొని బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ముఖ్యంగా కాపునాడుని దేశవ్యాప్తంగా విస్తరింప చేయడంలోనూ,కాపు సంఘాలు అన్నింటినీ ఏకతాటి పైకి తీసుకురావడానికి తన వంతుగా విజయవాడ కేంద్రంగా ఆయన విశేష కృషి చేశారన్నారు.

విజయవాడ నగరంలో విద్యార్థులు చదువుకోవడానికి రెండు విద్యాభవనాలను ఏర్పాటు చేసి వారికి ఉచితంగా వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గం ఒక మంచి నాయకుడిని కోల్పోవడం జరిగిందని అన్నారు.జోన్ 2 కాపునాడు కార్యవర్గం ముమ్మిడి వీరబాబు, గొంతిన ముక్తేశ్వరరావు, రుద్ర దుర్గాప్రసాద్ , పిల్ల దుర్గా ప్రసాద్, కాళ్ల చక్ర రావు, దేవకివాడ చక్రపాణి, ర్యాలీ రామకృష్ణ, తలారి శ్రీనివాస్, పసలపూడి లక్ష్మీనారాయణ, సింహాద్రి ప్రసాద్, సలాది తాతయ్య నాయుడు, గోపిశెట్టి విజయలక్ష్మి, బసవ సూర్య కుమారి, పోతుల గగన నాయుడు,అంజి,నాని తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY