Rajahmundry: దాట్ల పృథ్విరాజ్ పుట్టినరోజు వేడుకలు: రక్తదాన, ఉచిత దంత వైద్య శిబిరం
Rajahmundry: వైఎస్సార్సీపీ యువజన నేత దాట్ల పృథ్విరాజ్ పుట్టినరోజు సందర్భంగా సంహిత కాలేజీలో రక్తదాన, ఉచిత దంత వైద్య శిబిరాలను ఘనంగా నిర్వహించారు.
Rajahmundry: దాట్ల పృథ్విరాజ్ పుట్టినరోజు వేడుకలు: రక్తదాన, ఉచిత దంత వైద్య శిబిరం
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దాట్ల పృథ్విరాజ్ జన్మదిన సందర్భంగా సంహిత కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో వైఎస్ఆర్సిపి యువ నాయకుడు జక్కంపూడి గణేష్ రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
రక్తదాన శిబిరంతో పాటు డెంటల్ క్యాంప్ కూడా నిర్వహించారు. డెంటల్ క్యాంపును మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా ప్రారంభించారు. సుమారు 110 మంది రక్తదానం చేశారు.
డాక్టర్ వైయస్సార్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ బ్యాంకు సిబ్బంది రక్తాన్ని సేకరించారు. లెనోవా డెంటల్ కాలేజ్ డాక్టర్లు పరీక్షలు చేసి అవసరమైన మందులు అందచేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తగరం సోము,మేడి అర్జున్ రెడ్డి, పుష్ప నాయుడు, సాయి రెడ్డి, జోను రెడ్డి, గుత్తుల బాబి, నవీన్ తదితరులు పాల్గొని రక్తదానం చేశారు.




