Rajahmundry: క్రికెటర్ హన్సికకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సాయం!

Rajahmundry: అనారోగ్యంతో బాధపడుతున్న రాజమండ్రి యువ క్రికెటర్ విజయా శ్రీ హన్సికకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూ.1.50 లక్షల ఆర్థిక సాయం, సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.35 వేలు అందజేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 2 Aug 2026 3:24 PM IST
Rajahmundry
X

Rajahmundry: క్రికెటర్ హన్సికకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సాయం!

రాజమండ్రి: స్థానిక 42వ డివిజన్ లలితా నగర్ 5వ అడ్డ వీధికి చెందిన యువ క్రికెటర్ సొంటి విజయా శ్రీ హన్సికకు తమ భవాని చారిటబుల్ ట్రస్ట్, పలువురు సహకారంతో రూ. 1.50 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ 35 వేలు మంజూరు చేయించారు. హన్సిక చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని ప్రతిభ కనబరుస్తున్న సమయంలో అకస్మాత్తుగా రెండు కాళ్లు పనిచేయకుండా పోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది.

ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. వైద్యులు సూచించిన ప్రత్యేక చికిత్సకు భారీగా ఖర్చు అవుతుండటంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ఆర్థిక సహాయం సమకూరేలా చర్యలు తీసుకున్నారు.

కాగా ఈ ఆర్థిక సహాయం తమ కుమార్తె చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుందని హన్సిక కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కష్టసమయంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story