Rajahmundry: రాజమండ్రి 49, 50 డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పర్యటన!

Rajahmundry: 'మన వార్డులో మన ఆదిరెడ్డి' కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి 49, 50 డివిజన్లలో రాత్రి బస చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆరా.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 2 Aug 2026 3:21 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రి 49, 50 డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పర్యటన!

రాజమండ్రి: 'మన వార్డులో... మన ఆదిరెడ్డి' కార్యక్రమంలో భాగంగా 49, 50 డివిజన్లలో రాత్రి బస చేసిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ఆదివారం ఉదయం ఆయా డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

స్థానికులు వినిపించిన సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఆలస్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు, తాగునీటి సరఫరా, డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు, విద్యుత్ సమస్యలు, పారిశుద్ధ్యం, కాలువల శుభ్రత తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే వాసు దృష్టికి తీసుకురాగా, సమస్యల తీవ్రతను బట్టి ఆయా శాఖల అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సమస్యను నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ "ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించాలనే ఉద్దేశంతోనే 'మన వార్డులో... మన ఆదిరెడ్డి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.

ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది" అని తెలిపారు. ఎమ్మెల్యే వాసు స్వయంగా ఇంటింటికీ వచ్చి సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story