Rajahmundry: ప్రజల ముంగిటకు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్!

Rajahmundry: రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ఆధ్వర్యంలో ఘనంగా 'మన వార్డులో... మన ఆదిరెడ్డి' కార్యక్రమం.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 26 Jun 2026 1:31 PM IST
Rajahmundry
X

Rajahmundry: ప్రజల ముంగిటకు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్!

రాజమండ్రి: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చేపట్టిన "మన వార్డులో... మన ఆదిరెడ్డి" కార్యక్రమం గురువారం రాత్రి 6, 31 డివిజన్ల పరిధిలోని అన్నపూర్ణమ్మపేటలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ పార్టీ సీనియర్ కార్యకర్త నాలిపల్లి అప్పారావు నివాసంలో రాత్రి బస చేసి, శుక్రవారం ఉదయం కూటమి నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు.

ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఓర్పుగా విని తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యత అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ సమస్యలు, తాగునీటి సరఫరా, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు, పారిశుద్ధ్యం, కాలువల శుభ్రత తదితర అంశాలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

సమస్యలను అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేస్తూ, వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండదని ఎమ్మెల్యే శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, ప్రతి వార్డు అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

"మన వార్డులో... మన ఆదిరెడ్డి" కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వల్ల వాటి పరిష్కారం మరింత వేగంగా జరుగుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story