Kadiyam: కడియంలో కూటమి క్లీన్ స్వీప్: 22కి 20 ఎంపీటీసీలు కైవసం!

Kadiyam: రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలంలో కూటమి ప్రభంజనం సృష్టించింది. 22 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 11, జనసేన 8, బీజేపీ 1 కైవసం చేసుకోగా, వైసీపీ 2 స్థానాలకే పరిమితమైంది.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 7 Nov 2026 9:35 PM IST
Kadiyam
X

Kadiyam: కడియంలో కూటమి క్లీన్ స్వీప్: 22కి 20 ఎంపీటీసీలు కైవసం!

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజవర్గం కడియం మండలం లో జనసేన, టిడిపి ,బిజెపి కూటమి పార్టీలు జోష్ కనపరిచాయి. కూటమి అభ్యర్థులు 22 ఎంపీటీసీ స్థానాల్లో 20 స్థానాలు కైవసం చేసుకుని అనూహ్య విజయాన్ని అందుకున్నారు. మండలంలో ఎనిమిది స్థానాల్లో జనసేన, 13 స్థానాల్లో టిడిపి, బిజెపి ఒక స్థానంలోనూ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. శనివారం జరిగిన కౌంటింగ్ లో జనసేన ఎనిమిది బిజెపి ఒకటి,11 స్థానాలను టిడిపి కైవసం చేసుకున్నాయి. అనూహ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఈ గెలుపు కూటమి పార్టీ సంక్షేమ పాలనకే అంకితమని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరులు తెలిపారు.

కడియం మండలం లో గెలిచిన అభ్యర్థుల వివరాలు.....

కడియం-1 ఎంపీటీసీ వార్డులో కేతా వెంకట రమణ (టీడీపీ) వైసీపీ అభ్యర్థి, రామకృష్ణ పై గెలిచారు. కడియం 2 వ వార్డులో దాసరి చంద్రకళపై (వైఎస్సార్‌సీపీ), నందం భవాని (టీడీపీ) విజయం సాధించారు. కడియం-3 లో తమ్మిశెట్టి లేపాక్షి జనసేన పార్టీ అభ్యర్థి వీర మణి గుడాల (వైఎస్సార్‌సీపీ) పై గెలుపొందారు. కడియం-4 లో శాఖా మరియమ్మ (వైఎస్సార్‌సీపీ) అభ్యర్థి శాంతి బట్టు — భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ,సంధ్యా రాణి జువ్వల — తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఇరువురి అభ్యర్థులపై ఆదిపత్యం సాధించారు.

కడియం నాలుగు వార్డులను మరియమ్మ స్వల్ప ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కడియపుసావరం లో గంధం దుర్గారావు — జనసేన పార్టీ అభ్యర్థి సాపిరెడ్డి లక్ష్మికాంతం (వైఎస్సార్‌సీపీ) పై విజయం సాధించారు.

కడియపులంక-1 లో తాడాల రాజ రాజేశ్వరి — (వైఎస్సార్‌సీపీ) ఎంపీపీ అభ్యర్థి పై కూటమి పార్టీ ఎంపీపీ అభ్యర్థిని బోడపాటి పుణ్యవతి భర్త బోడపాటి గోపాలకృష్ణ (టీడీపీ) నుండి విజయం సాధించారు.

కడియపులంక-2 లో తాళం నరేష్ — జనసేన పార్టీ అభ్యర్థి తూపాటి దుర్గా ప్రకాష్ (వైఎస్సార్‌సీపీ) పై విజయం సాధించారు.కడియపులంక-3 లో తాడాల విష్ణు చక్రవర్తి (వైఎస్సార్‌సీపీ) పై నాగులపల్లి వీరబాబు (బీజేపీ) అభ్యర్థి విజయం సాధించారు.కడియపులంక-4 లో అన్నపూర్ణ సింహంద్రి (వైఎస్సార్‌సీపీ) పై* క్రొవ్విడి భాస్కర శ్రీనివాస రావు జనసేన పార్టీ అభ్యర్థి గెలిచారు.

కడియపులంక-5 లో అంజూరి లక్ష్మి (టీడీపీ) అభ్యర్థి రెడ్డి పద్మావతి (వైఎస్సార్‌సీపీ) పై ఆదిపత్యం సాధించారు.

కడియపులంక-6 లో బోడపాటి మోహిని వీర పుణ్యవతి (టీడీపీ) ఎంపీపీ అభ్యర్థిని సలాది ప్రసాద్ (వైఎస్సార్‌సీపీ) పై విజయం సాధించారు. పొట్టిలంక కామిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ జనసేన పార్టీ అభ్యర్థి కొత్తపల్లి వెంకన్న (వైఎస్సార్‌సీపీ) పై 1753 అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. వీరవరం లో జట్ల వెంకట గౌరిశ్రీ (టీడీపీ) అభ్యర్థి యర్రా నాగదేవి (వైఎస్సార్‌సీపీ) పై గెలుపొందారు.

దామిరెడ్డిపల్లి, అన్నందేవుల శ్రీదేవి (వైఎస్సార్‌సీపీ) అభ్యర్థిపై జనసేన అభ్యర్థి ధర్మాసనం సుజాత గెలుపు పొందారు. మాధవరాయుడుపాలెం లో గువ్వాడ చిరంజీవి (వైఎస్సార్‌సీపీ) పై శ్రీనివాసు పోలినాటి (టీడీపీ) విజయం సాధించారు. మాధవరాయుడుపాలెం-2 లో గొల్లపల్లి గంగామణి — తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సంగీత వెంకట గిరి రాజకుమారి (వైఎస్సార్‌సీపీ) పై విజయం సాధించారు.జేగురుపాడు 1 లో వరసాల పూర్ణలత (వైఎస్సార్‌సీపీ) పై వెంకట లక్ష్మీ వందే (టీడీపీ)గెలుపొందారు. జేగురుపాడు 2 లో నాగిరెడ్డి మణి కుమారి — జనసేన అభ్యర్థి రేవతి సింధు గరగపర్తి (వైఎస్సార్‌సీపీ) పై గెలుపొందారు.

మురమండ-1 లో యర్రా వీర భద్రుడు — తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి వైసీపీ అభ్యర్థి యర్రా సూర్యనారాయణ పై గెలుపొందారు. మురమండ-2 లో గుండుబోగుల రామ ప్రసాద్ — తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి వీర ముత్యాల రావు (వైఎస్సార్‌సీపీ) పై పట్టు సాధించారు. దుళ్ళ మాజీ సర్పంచ్ కొండపల్లి పట్టియ్య సతీమణి కొండపల్లి మల్లేశ్వరి (వైఎస్సార్‌సీపీ) అభ్యర్థిగా పోటీ చేసి మెర్ల వరలక్ష్మి జనసేన పార్టీ చేతిలో ఓటమి పాలయ్యారు.దుళ్ళ-2 లో గ్రంధి విజయలక్ష్మి — తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిపై ముసునూరి వెంకట సుబ్రహ్మణ్య పద్మావతి (వైఎస్సార్‌సీపీ) విజయాన్ని సొంతం చేసుకుని కూటమి సునామీలో 246 ఓట్ల మెజార్టీ సాధించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL