Rajahmundry: రాజమహేంద్రవరం రూరల్‌లో కార్పొరేటర్ స్థానాలపై కూటమిలో కుంపట్లు!
Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కార్పొరేటర్ స్థానాల కేటాయింపు వ్యవహారం కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది.
Rajahmundry: రాజమహేంద్రవరం రూరల్‌లో కార్పొరేటర్ స్థానాలపై కూటమిలో కుంపట్లు!
రాజమండ్రి: నగరపాలక సంస్థ కార్పొరేటర్ అభ్యర్థుల స్థానాల కేటాయింపు వ్యవహారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కూటమి పార్టీల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 30 శాతం రేషియో ప్రకారం రూరల్ నియోజకవర్గానికి 10 కార్పొరేటర్ స్థానాలు కేటాయించాల్సి ఉండగా, తొలుత ఇచ్చిన మాటకు విరుద్ధంగా 10 స్థానాలను 8 స్థానాలని ఇప్పుడు 5 స్థానాలే పరిమితం చేస్తున్నారంటూ జనసేన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ పార్టీ అబ్జర్వర్ చెబుతున్న స్థానాల సంఖ్యపై జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జనసేన నాయకులు పట్టుబడుతుండగా, ఈ స్థానాల కేటాయింపుపై ససేమిరా అంటున్న జనసేన వర్గాలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. మాట నిలబెట్టుకుంటారా? లేక కూటమిలో కొత్త వివాదానికి తెరలేపుతారా? రాజమహేంద్రవరం రూరల్ రాజకీయాల్లో కార్పొరేటర్ స్థానాల పంచాయితీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.




