Rajahmundry: కడియం జడ్పీ హైస్కూల్‌లో పకడ్బందీగా ఎస్ఎంసి ఎన్నికలు!

Rajahmundry: రాజమండ్రి రూరల్ కడియం మండలం పీఎం శ్రీ పాఠశాలలో SMCఎన్నికలు నిర్వహించగా అధ్యక్షురాలిగా దుర్గాదేవి ఉపాధ్యక్షుడిగా ప్రేమకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 1 Oct 2026 12:07 PM IST
Rajahmundry
X

Rajahmundry: కడియం జడ్పీ హైస్కూల్‌లో పకడ్బందీగా ఎస్ఎంసి ఎన్నికలు!

Rajahmundry: మండల కేంద్రమైన కడియం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసి) ఎన్నికలు పగడ్బందీగా జరిగాయి. మండల విద్యాశాఖాధికారి వై నాగేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలలో పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షురాలిగా కామిశెట్టి దుర్గాదేవి, ఉపాధ్యక్షులుగా సాదే ప్రేమ కుమార్ ఎన్నుకోబడ్డారు.

వీరితో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి 17 మంది, ఉపాధ్యాయులు అంగన్వాడీలు హెల్త్ డిపార్ట్మెంట్ ల నుండి 6 గురు, మొత్తం 25 మంది సభ్యులతో కమిటీ ఏర్పడినట్లు ఎంఇవో తెలిపారు. కొత్తగా ఏర్పడిన పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, పూర్వ విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL