Rajahmundry: రాజమండ్రిలో వైభవంగా శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం

Rajahmundry: రాజమండ్రిలో శ్రావణ అమావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం వైభవం. దేశంలోనే తొలిసారిగా వాహనంతో కూడిన మహాలక్ష్మి హోమం.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 10 Sept 2026 11:16 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో వైభవంగా శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం

రాజమండ్రి: పంచ పర్వములలో మహా పర్వమైనటువంటి అమావాస్య రోజున శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద గురువారం శ్రావణ మాస అమావాస్య సందర్బంగా అత్యంత విశేషమైన ప్రయుక్త శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం జరిగింది.

భారతదేశంలోని మొట్టమొదటిసారిగా వాహనంతో కూడుకున్న మహాలక్ష్మి హోమం జరగడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి హోమంలో పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ బోడెం నాగ సత్య రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో పండిత పురోహితుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.

శ్రావణ మాస అమావాస్య రోజున చేసే శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం చాలా పవిత్రమైనదని, ఈ హోమం వలన సంపద, ఆర్థిక స్థిరత్వం, ఇతర సమస్యల పరిష్కారం కోసం చేసే ఒక శక్తివంతమైన పూజా విధానమని,దీని ద్వారా లక్ష్మీదేవి, కుబేరుడు, సుదర్శన చక్రం (విష్ణుమూర్తి) యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్ ,ఉమా మార్కండేయ లలితా మండలి సభ్యులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story