Rajahmundry: గోకవరం పీఎంపీలకు సన్ స్టార్ హాస్పిటల్ కొండంత అండ!
Rajahmundry: గోకవరం లో పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో రాజమండ్రి సన్ స్టార్ హాస్పిటల్ ఆర్థిక సహకారంతో సభ్యులకు పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించారు.
Rajahmundry: గోకవరం పీఎంపీలకు సన్ స్టార్ హాస్పిటల్ కొండంత అండ!
రాజముండ్రి: కమ్యూనిటీ పారామెడిక్స్&ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పిఎంపి అసోసియేషన్) గోకవరం మండల సభ్యులకు బుధవారం స్థానిక ధరణి ఫంక్షన్ హాల్ నందు మండల అధ్యక్షులు పి చిన్ని అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది.
ఈ సదస్సులో రాజమండ్రి కి చెందిన సన్ స్టార్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జమ్ము కోదండ రామ్,డాక్టర్ నక్కా సుధాకర్,డాక్టర్ భాగ్యప్రీతి,డాక్టర్ కార్తీక్,డాక్టర్ పర్వీన్ లు హాజరై అధునాతన వైద్య విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం సన్ స్టార్ హాస్పిటల్ వారి ఆర్థిక సహకారంతో మండలం లోని సభ్యులకు పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణ లో కీలకమైన పీఎంపీ లకు జీవిత భీమా ఏర్పాటు చేసిన సన్ స్టార్ హాస్పిటల్ యాజమాన్యం కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎస్ సూరిబాబు, కోశాధికారి జి లాజర్,ఎమ్ నాగేశ్వరరావు, జి వెంకటేష్, జీఎస్ఎస్ ప్రసాద్, సీహెచ్ విశ్వేశ్వరరావు,జేఎన్ మూర్తి, కరాసు లక్ష్మణరావు, జి.చిట్టిబాబు లతో పాటు సభ్యులు హాజరయ్యారు.అనంతరం వైద్యులను సభ్యులు సత్కరించటం జరిగింది.




