Rajahmundry: రాజమండ్రి నాణ్యతతో పనులు పూర్తి చేయాలి కమిషనర్

Rajahmundry: రాజమండ్రిలో అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించిన కమిషనర్ రాహుల్ మీనా. కొత్త పనులకు త్వరగా టెండర్లు పిలవాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 8 July 2026 4:10 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రి నాణ్యతతో పనులు పూర్తి చేయాలి కమిషనర్

రాజమండ్రి: నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. బుధవారం ఉదయం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.

ఉమెన్స్ కాలేజీ రోడ్డులో రూ. 14.50 లక్షలతో నిర్మించిన ఆర్.పి.సి. కల్వర్టు., గానుగవీధిలో రూ. 35 లక్షలతో నిర్మించిన సీసీ బెర్ములు., మేడూరి స్ట్రీట్ లో రూ. 9.90 లక్షలతో నిర్మించిన సీసీ డ్రెయిన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని.. ఎక్కువ కాలం నిలిచిపోయేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అనంతరం పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 4వ వార్డు రాజేంద్రనగర్లో రూ. 9.90 లక్షల అంచనాతో సీసీ రోడ్డు ప్యాచ్ వర్కులు, సీసీ కల్వర్టు నిర్మాణం., 2వ వార్డు గోపాల్ నగర్ పుంతలో రూ. 56 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం., 8వ వార్డు ప్రకాశంనగర్ రౌండ్ పార్కు ఎదురు రోడ్డులో రూ. 56 లక్షలతో సీసీ రోడ్డు మరియు సీసీ డ్రెయిన్ నిర్మాణానికి అంచనాలు రూపొందించగా.. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కమిషనర్ ఆదేశించారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పనులు జరగాలని స్పష్టం చేశారు. పర్యటనలో ఎస్ఈ రీటా, ఏఈ సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story