Rajahmundry: కోటిలింగాల ఘాట్‌ను నమూనాగా తీర్చిదిద్దాలి: కమిషనర్
Rajahmundry: రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌ను మోడల్ ఘాట్‌గా తీర్చిదిద్దాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. గోదావరిలో మురుగు కలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Rajahmundry: కోటిలింగాల ఘాట్‌ను నమూనాగా తీర్చిదిద్దాలి: కమిషనర్
రాజమండ్రి: రాజమండ్రిలోని చారిత్రాత్మక కోటిలింగాల ఘాట్‌ను ఓ నమూనా ఘాట్ గా తీర్చిదిద్ది.. మిగిలిన ఘాట్లన్నింటిలోనూ ఇదే శైలిని వర్తింపజేయాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు.
గురువారం ఉదయం అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, టౌన్ ప్లానింగ్ విభాగం, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఘాట్ పరిసరాలను ఆయన పరిశీలించారు.
ఘాట్లన్నింటినీ ఒకే తరహా ఏకరూప నమూనాలో అభివృద్ధి చేయడం ద్వారా నదీ తీరం అంతా ఏకరీతిలో, ఆకర్షణీయంగా కనిపిస్తుందన్నారు.
ఇందులో భాగంగా కోటిలింగాల ఘాట్ లోనికి ప్రవేశించు మార్గాలు, వెలుపలకు వెళ్లు మార్గాలు, ఫీడింగ్ రూమ్, టాయిలెట్లు, దుస్తులు మార్చుకొను గదులు, జల్లు స్నాన ఏర్పాట్లను సురక్షితంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలన్నారు.
అలాగే ఈ ప్రదేశాన్ని పరిశుభ్రత, అద్భుతమైన లైటింగ్ మరియు ఆధునిక హంగులతో సమగ్ర పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉందన్నారు.
ఇటు సందర్శకులు, అటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఈ ఘాట్‌ను తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు.ముఖ్యంగా కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణ అనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్లాలన్నారు.
చుక్క మురుగునీరు కూడా గోదావరిలోకి కలవకుండా పక్కా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ప్రదేశాన్ని ప్లాస్టిక్ రహితంగా మరియు పరిశుభ్రమైన పర్యాటక ప్రాంతంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
ఆయన వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మహేష్, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఈఈలు మదర్షా అలీ, మాధవి, ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు.




