Rajamahendravaram: రాజమహేంద్రవరం రూరల్లో అభివృద్ధి పనులకు గోరంట్ల శంకుస్థాపన
Rajamahendravaram: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రూ.80 లక్షల రుడా నిధులతో రెండు నూతన సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు.
Rajamahendravaram: రాజమహేంద్రవరం రూరల్లో అభివృద్ధి పనులకు గోరంట్ల శంకుస్థాపన
Rajamahendravaram: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుని పోతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కాతేరు రాముడి చెరువు వద్ద 40 లక్షల రూపాయలతో నూతన సీసీ డ్రైనేజీ నిర్మాణం, కోలమూరు పంచాయతీ జంగాల కాలనీ నందు 40 లక్షల రూపాయలతో నూతన సీసీ డ్రైనేజీ నిర్మాణం, మొత్తం కలిపి 80 లక్షల రూపాయలు రుడా నిధులతో నిర్మాణం చేసే రెండు సీసీ డ్రైనేజీల నిర్మాణానికి ఆయన కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి అన్ని గ్రామాల రూపు రేఖలు మార్చేందుకు కృషిచేస్తున్నామని వెల్లడించారు. రూరల్ గ్రామాలన్నింటికి స్వచ్ఛమైన గోదావరి తాగు నీరందిందేందుకు జల జీవన్ మిషన్ ద్వారా 194 కోట్ల నిధులు విడుదలయ్యాయని, ఈనెల 9న పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.
కాతేరు, కోలమూరు, కొంతమూరు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి మౌళిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తు 8 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్టు వివరించారు. అన్ని గ్రామాలు కార్పొరేషన్లో కలుస్తున్నాయని, అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయన్నారు. రుడా నిధులతో పాటు ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులు కూడా అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర డైరెక్టర్లు యామన నారాయణ గౌడ్, యానాపు యేసు, మద్దా మణి, కర్రీ అప్పలస్వామి, నున్న కృష్ణ, గంగిన హనుమంతరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, గంగిన నాని, ఉండవల్లి బంగార్రాజు, అడ్డాల శ్రీను, నాగుల శివ, తాడేపల్లి నాగరాజు,మేక గణపతి, సయ్యద్ ఉమర్, షేక్ ఖాసీం, బత్తిన కొండబాబు, బత్తిన రత్నరాజు,నల్లమిల్లి శ్రీను, సుల్తాన, శ్రీదేవి, కండవల్లి దుర్గా, సుధీర్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, ఎంపీడీవో సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఇన్చార్జ్ ఏ.ఈ జెడి ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శులు రాధాకృష్ణ, ద్విభాష్యం శ్రీనివాసరావు, స్థానిక పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.




