Rajahmundry: సిబ్బందికి అసౌకర్యం కలగకుండా చూడాలి రాహుల్ మీనా ఆదేశం
Rajahmundry: రాజమండ్రి SKVT కళాశాలలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కమిషనర్ రాహుల్ మీనా; సిబ్బందికి వసతులపై ఆదేశాలు.
Rajahmundry: సిబ్బందికి అసౌకర్యం కలగకుండా చూడాలి రాహుల్ మీనా ఆదేశం
రాజమండ్రి: పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాల వద్ద సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. మంగళవారం SKVT కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయా లేదా అనే అంశాన్ని స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని.. త్రాగునీరు, భోజనం, విద్యుత్, షామియానాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. బ్యాలెట్ పత్రాల భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్లు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఈఈలు మదర్షా అలీ, మాధవి, డీఈలు లోవరాజు, విరూపాక్ష, ఏఈలు సత్యనారాయణ, రమేష్, ఇతర సిబ్బంది ఉన్నారు.




