Rajanagaram: పల్లకడియం, సీతారాంపురంలో ఘనంగా వనిత వేడుకలు

Rajanagaram: రాజానగరం మండలం పల్లకడియం, సీతారాంపురంలో ఘనంగా కంబాల కాను వనిత వేడుకలు. మహిళలకు ఉచితంగా పట్టుచీరలు పంపిణీ చేసిన బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు.

NARAYANA, RAJANAGARAM
Published on: 22 July 2026 4:58 PM IST
Rajanagaram
X

Rajanagaram: పల్లకడియం, సీతారాంపురంలో ఘనంగా వనిత వేడుకలు

రాజానగరం: రాజానగరం మండలం పల్లకడియం, సీతారాంపురం గ్రామాలలో మంగళవారం రాత్రి నిర్వహించిన కంబాల కాను వనిత వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తొలిత ఆయనకు ఆయా గ్రామాల మహిళలు హరతులతో స్వాగతం పలికారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, అభిమానులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కంబాల శ్రీనివాసరావు ఆయా గ్రామాలలోని పలు ఆలయాలను దర్శించుకుని, పూజలు నిర్వహించి, గ్రామ దేవతలకు తొలి చీరలను సమర్పించారు.

ఈ కార్యక్రమానికి రెండు గ్రామాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని, జయప్రదం చేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు పల్లకడియం గ్రామంలో 620 మందికి సీతారాంపురం గ్రామంలో 680 మంది మహిళలకు ఉచితంగా పట్టుచీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని, వారిని గౌరవించుకోవడం మన బాధ్యతని అన్నారు.

కులమతాలకు అతీతంగా మూడు నియోజకవర్గాల్లో తమ సేవలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదం, సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు, యువత తదితరులు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story