Rajanagaram: రాజానగరంలో భారీగా గంజాయి సీజ్ మహారాష్ట్ర యువకులు అరెస్ట్!

Rajanagaram: రాజానగరం సమీపంలో రెండు కార్లలో తరలిస్తున్న 10 లక్షల విలువైన 120 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు అరెస్ట్.

NARAYANA, RAJANAGARAM
Published on: 4 July 2026 8:54 PM IST
Rajanagaram
X

Rajanagaram: రాజానగరంలో భారీగా గంజాయి సీజ్ మహారాష్ట్ర యువకులు అరెస్ట్!

రాజానగరం: రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కార్లలో 120 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు శనివారం పట్టుకున్నారు. నాలుగురు యువకులను అరెస్టు చేసి, రెండు కార్లు,నగదు,సెల్ ఫోన్ సీజ్ చేశారు.

నిందితులు మహారాష్ట్ర తానే జిల్లా పింప్లాస్ చెందిన పేట్రియాట్స్ మిత్ ప్రదీప్, ప్రటియాస్ సుందర్ బారుడే, ఆదిత్య అరవింద్, నిఖిల్ మధుకర్ పాటిల్ రెండు కార్లలో గోకవరం నుండి మహారాష్ట్ర సమీపంలో పూణేకు గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో కొంతమూరు దినేష్ దాబా సమీపంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది.

వీరిపై కేసు నమోదు చేసి 120 కిలోల గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, రూ.1770 స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. గంజాయి విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని వివరాలు సిఐ తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసిన ఎస్ఐ ఎస్. ప్రియకుమార్, ఈగల్ సిబ్బందిని అభినందించారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story