Rajanagaram: రాజానగరం నియోజకవర్గంలో వైసీపీలోకి భారీ చేరికలు
Rajanagaram: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిధిలోని గాదరాడ, మధురపూడి గ్రామాలకు చెందిన టీడీపీ, జనసేన నాయకులు జక్కంపూడి రాజా, చెల్లుబోయిన వేణు సమక్షంలో వైసీపీలో చేరారు.
Rajanagaram: రాజానగరం నియోజకవర్గంలో వైసీపీలోకి భారీ చేరికలు
Korukonda: కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజానగరం మండలం దివాన్‌చెరువులోని ఎం.ఎఫ్. కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
గాదరాడ గ్రామానికి చెందిన ఫిషరీస్ సొసైటీ అధ్యక్షుడు కందికట్ల మరిడియా, కొల్లబత్తుల నాగేశ్వరరావు, కందికట్ల భూషణం, కురం గణేష్, చింతపల్లి రాజ్‌కుమార్, కొల్లబత్తుల కొండయ్య, గంధం అనిల్‌కుమార్, కందికట్ల జాన్, కురం భీమరాజు, వల్లూరి మణి, కొల్లబత్తుల గణేష్, కురం బన్నీ, బోడా యేసు, కొల్లబత్తుల నరసింహం, వల్లూరి ప్రసన్నకుమార్ తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు.
ఈ కార్యక్రమంలో గాదరాడ గ్రామ నాయకుడు చీర్ల రాంబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు వనం గంగాధర్, కురం చిన్ని, నాయకులు పిల్లి త్రిమూర్తులు, చీర్ల శివసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
మధురపూడి నుంచి జనసేన నాయకుల చేరిక
మధురపూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ఆకుల సూరిబాబు, మేడిశెట్టి తాతారావు తదితరులు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమం లో గణేశుల పోశారావు తదితరులు పాల్గొన్నారు.




