Rajole: రాజోలు ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణానికి సానుకూల స్పందన!
Rajole: రాజోలులో ఎస్సీ బాలుర వసతి గృహ నూతన భవన నిర్మాణానికి SASCI పథకం కింద నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎమ్మెల్యే తెలిపారు.
Rajole: రాజోలు ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణానికి సానుకూల స్పందన!
Rajole: ఎస్సీ బాలుర వసతి గృహానికి నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హాస్టల్‌కు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత శాసనసభ సమావేశాల సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శి, డైరెక్టర్‌లతో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమావేశమై రాజోలు ఎస్సీ బాలుర వసతి గృహానికి నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన అధికారులు SASCI పథకం కింద త్వరలోనే నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీంతో హాస్టల్ నిర్మాణానికి సంబంధించి ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, వసతి సౌకర్యాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అంశంపై ఎస్సీ సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు సంయమనం పాటించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.




