Rajolu: పోతుమట్ల ఇందిరమ్మ కాలనీలో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హామీ
Rajolu: రాజోలు మండలం చింతలపల్లిలోని పోతుమట్ల ఇందిరమ్మ కాలనీని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సందర్శించారు.
Rajolu: పోతుమట్ల ఇందిరమ్మ కాలనీలో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హామీ
Rajolu: రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలోని పోతుమట్ల ఇందిరమ్మ కాలనీని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
2008 లో 94 ప్లాట్లతో ఏర్పాటైన ఈ కాలనీకి ఇప్పటివరకు సరైన అప్రోచ్ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీకి రోడ్డు నిర్మాణం కోసం సుమారు 13 సెంట్ల జిరాయితి భూమి అవసరమవుతుండగా, ఆ భూమికి సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ భూమికి సంబంధించి ఐదుగురు రైతులు కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సంబంధిత రైతులతో సమావేశమై చర్చలు జరిపారు. గ్రామాభివృద్ధి, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అప్రోచ్ రోడ్డు నిర్మాణంతో పాటు తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు స్వచ్ఛందంగా సహకరించాలని రైతులను కోరారు. గ్రామాభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి రైతులు సానుకూలంగా స్పందిస్తూ, రెండు రోజులలో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే కాలనీని సందర్శించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీవాసులు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పాటు విద్యుత్ సరఫరా సమస్యలు, తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
తదనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాలనీ అప్రోచ్ రోడ్డు సమస్యను త్వరితగతిన పరిష్కరించి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే రోడ్డు నిర్మాణం, తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు సంబంధించిన సర్వే పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాలనీవాసుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.




