Rampachodavaram: రంపచోవరంలో దెబ్బతిన్న సీసీ రోడ్డు!

Rampachodavaram: అల్లూరి సీతారామరాజు రంపచోడవరం ఐటీడీఏ 'C' క్వార్టర్స్‌లో దెబ్బతిన్న సీసీ రోడ్డు గుంతల కారణంగా ఇబ్బంది పడుతున్న స్థానికులు, మరమ్మతులకు విజ్ఞప్తి.

Prasanna, Rampachodavaram
Published on: 22 Sept 2026 10:01 AM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంపచోవరంలో దెబ్బతిన్న సీసీ రోడ్డు!

Rampachodavaram: పోలవరం జిల్లా,రంపచోడవరం ఐటీడీఏ 'C' క్వార్టర్స్‌ పరిధిలోని సీసీ రోడ్డు పలు చోట్ల దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో స్థానికులు, రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు పక్కన కాలువ ప్రాంతం కూడా దెబ్బతినడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.

వర్షాలు కురిసే సమయంలో గుంతల్లో నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న సీసీ రోడ్డును పరిశీలించి, త్వరితగతిన మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram