Rampachodavaram: శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి
Rampachodavaram: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి.
Rampachodavaram: శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి
రంపచోడవరం: రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శిరీషాదేవి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం పుతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవిని దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు జ్ఞాపికను అందజేశారు. ఇరువురు ఎమ్మెల్యేలు కొద్దిసేపు ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలపై పరస్పరం మాట్లాడుకున్నారు.
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనం తనకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించిందని ఎమ్మెల్యే శిరీషాదేవి పేర్కొన్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు, అనుచరులు పాల్గొన్నారు.




